– కమిషనర్‌కు టీయూఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
104 ఎఫ్‌డీహెచ్‌ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (టీయూఎంహెచ్‌ఇయూ-సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం యూనియన్ గౌరవాధ్యక్షులు భూపాల్ నేతత్వంలో రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ఫసియుద్దీన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదనాయక్, నాయకులు ఎన్.శ్రీనాథ్ హైదరాబాద్‌లో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు సమ్మె నోటీస్ ను అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే సెప్టెంబర్ 20 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళతామని హెచ్చరించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 104 ఎఫ్‌డీహెచ్‌ఎస్ సేవలను 2022లో నిలిపేసిందని తెలిపారు. దాదాపు 1,095 మంది డీఎంహెచ్‌ఓల పరిధిలో వివిధ విభాగాల పరిధిలో పని చేస్తున్నట్టు చెప్పారు. వారిలో 710 మందికి కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి మిగిలిన 381 మందికి ఇవ్వలేదని పేర్కొన్నారు. అదే విధంగా ఉద్యోగులందరికి ఏప్రిల్ నెల నుంచి 6 నెలల వేతనాలను పెండింగ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. మిగిలిన వారికి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. డీఎంఈ పరిధిలోకి మార్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సొంత జిల్లాలకు మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు.
104 ఎఫ్‌డీహెచ్‌ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES