నవతెలంగాణ – రాజోలి
చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు శాంత కుమార్ ప్రధాన కార్యదర్శి శ్రీహరి లు డిమాండ్ చేశారు. రాజోలి మండలంలో బుధవారం రోజు భారీ ఎత్తున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎక్స్ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శాంత్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుపై జరుగుతున్న నిరసనలకు చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి ఎమ్మార్వో కి వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు. చేనేత రుణమాఫీ ని తక్షణమే అమలు చేయాలని చేనేత పథకాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అందించాలని బ్యాంకుల ద్వారా ఐదు లక్షల రూపాయలు లోపు రుణాలు మంజూరు చేయాలని కార్మికులు కోరారు.
అలాగే చేనేత కార్మికులు మరణించినప్పుడు చేనేత బీమా కింద ఐదు లక్షల రూపాయలు ఆలస్యం లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు కొత్తగా ప్రవేశపెట్టిన జియో ట్యాగింగ్ ఆర్డి మరియు ఇతర పథకాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు తెలిపారు. గుంత మగ్గాల ప్రాంతంలో వర్షాకాలంలో నీరు చేరడం వల్ల పనులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం వర్క్ షెడ్యూల్ గృహ నిర్మాణాలు వెంటనే చేపట్టాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత రాష్ట్ర అధ్యక్షుడు శాంతి కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జి మురళి రాజోలి చేనేత సహకార సంఘం అధ్యక్షుడు ద్రోతి శ్రీనివాసులు సహకార సంఘం ఉపాధ్యక్షుడు అచ్చు గట్ల మాబు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పులిపాటి దస్తగిరి చేనేత కార్మికులు స్థానికులు హాజరయ్యారు.



