Saturday, October 11, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రజా కోణమే.. పత్రికల పని

ప్రజా కోణమే.. పత్రికల పని

- Advertisement -

సమస్యల గుర్తింపుతోనే.. పరిష్కార మార్గాలు
రాజకీయ, ఆర్థిక కోణాలు క్షుణ్ణంగా పరిశీలించాలి 
అమెరికా ఆధిపత్యంపై దేశాల తిరుగుబాటు 
రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, నవతెలంగాణ బ్యూరో చీఫ్ పద్మరాజు
వనపర్తిలో విలేకరుల వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు
నవతెలంగాణ- వనపర్తి

సమాజంలోని అట్టడుగు వర్గాల, మెజార్టీ ప్రజల సమస్యలపైనే పత్రికల కోణం దృష్టి ఉండాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్, నవతెలంగాణ బ్యూరో చీఫ్ బి వి ఎన్ పద్మరాజు లు అన్నారు. సమాజంలోని మంచి చెడుల గుర్తింపుతోనే పరిష్కారం మార్గాలు దొరుకుతాయని, పత్రికలు సమస్యలను వెలికితీయడం ద్వారానే వాటికీ పరిష్కార మార్గాలను వెతుక్కోగలుగుతామని ఆయన ఉద్ఘాటించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అనసూయ మినీ ఫంక్షన్ హాల్లో శనివారం ఉమ్మడి జిల్లా విలేకరులకు వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రాంతీయ ప్రతినిధి పరిపూర్ణం అధ్యక్షతన క్లాసులు నిర్వహించగా నవతెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్ డివిఎన్ పద్మరాజు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రతి జర్నలిస్టు నిరంతర పాఠకునిగా ఉండాలన్నారు. నిత్య పట్టణం ద్వారానే సమాచార అవగాహన, సమస్యలపై లోతైన విశ్లేషణ చేయగలుగుతామని సూచించారు.

సమస్య ఎక్కడుంటే జర్నలిస్టు అక్కడ ప్రత్యక్షం అవ్వాలని, సమాజంలోని రుగ్మతలను ప్రజా సమస్యలను, ప్రభుత్వ పాలన తీరును సమాజానికి వార్తా రూపంలో ప్రచురించి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. సమాజంలో నెలకొంటున్న అస్పృశ్యతలను రూపుమాపేందుకు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, మూఢ విశ్వాసాలను పారదోలెందుకు జర్నలిస్టులు విశ్లేషణతో కూడిన కథనాలను ప్రచురించాలని సూచించారు. వార్తా కథనం ఆసక్తికరంగా కంటెంట్ దెబ్బ తినకుండా నూతనమైన శీర్షికల ద్వారా మంచి లేడు తో రాసే వార్తలకు జనాదరణ పెరుగుతుందన్నారు. వార్తలు రాసేటప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని సమూహానికి ఆపాదించరాదని జర్నలిస్టులో నిరంతరం గుర్తు ఎరగాలని సూచించారు. ఎవరినీ కించపరిచేవి గాని నిరాహార ఆరోపణలు వార్తలు గాని ప్రచురించరాదన్నారు. రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రతి జర్నలిస్టు ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సూచించారు. విషయ అవగాహన కోసం సాహిత్యాన్ని,  వార్తాపత్రికలను, చరిత్ర ఆధారమైన పుస్తకాలను నిరంతరం చదవాలని తెలిపారు. 

 ఇటీవల ప్రపంచంలో చోటు చేసుకుంటున్నా పరిణామాలను గమనిస్తే రష ఉక్రెయిన్ యుద్ధంతో మానవాళికి తీవ్ర అన్యాయం, ఆయా దేశాలకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. యుద్ధాలు జరగడం మూలాన ఆయా దేశాలలో ఆర్థిక సామాజిక ఆస్తుల రూపంలో జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నారు. ఈ యుద్ధాలు జరిగే కుట్రల వెనక అమెరికా ఆధిపత్య కుట్ర దాగి ఉందని అన్నారు. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని, తద్వారా సంపత్తిని విక్రయించుకునే ప్రయత్నాలు తప్ప శాంతి నేలకొల్పే ప్రయత్నం  ట్రంప్ చేయట్లేదని గుర్తు చేశారు. భారత్ పాకుల మధ్య చోటు చేసుకున్న యుద్ధాన్ని తానే ఆతానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత కల్లోలమైన ఘటనలు, మహిళలు, చిన్నారులు దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు.

ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలకు కారణమైన ట్రంప్ శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలని కోరడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న చైనాను నిలువరించలేక బ్రిక్స్ దేశాలపై ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అమెరికా అనుపవర్ను ఆటో పవర్ ను ఉపయోగించి ఎగుమతులపై దిగుమతులపై విపరీతమైన సుంకాలు విధిస్తూ చిన్నచిన్న దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. వీటి ఫలితంగా చిన్నచిన్న దేశాలైన పెద్ద దేశాలైన పన్నుల విధింపు వల్ల ఆయా దేశాల్లోని ఉత్పత్తి రంగాలు కుదేలయ్యే పరిస్థితి ఉందన్నారు. కాబట్టి అమెరికా పెత్తనంపై ఎదురుదాడి చేసేందుకు మిల్క్ స్తోపాటు ఇతర అనేక దేశాలు ఒకటవుతున్నాయని ఈ పరిణామాలను జర్నలిస్టులు గుర్తించాలని సూచించారు.

 అంతకుముందు వనపర్తి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తుంటామని, ప్రజా కోణంలో పరిశీలించే జర్నలిస్టులే ఆయా సమస్యలను గుర్తించి ప్రభుత్వాలు, ప్రతిపక్షాల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేడున్న పరిస్థితుల్లో పేదల సమస్యలు అనేకం ఉన్నాయని, ప్రభుత్వాలు పాలన సక్రమంగా ఉండడం లేదన్నారు. రాజ్యాంగం పైనే దాడి చేసే పరిస్థితులు నేటి సమాజంలో దాపరిచాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సమాజ హితం కోరి కథనాలు ఉండాలని సూచించారు. 

 ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్ వాసు, ఉమ్మడి జిల్లా రీజియన్ మేనేజర్ కార్తీక్, డెస్క్ ఇన్చార్జి భాస్కర్, వనపర్తి డివిజన్ ఇంచార్జి బాబు, నవతెలంగాణ వెబ్ నిర్వాహకులు రాజు జిల్లా కేంద్రంలోని విలేకరులు రాము, మన్మోహన్, ఉమ్మడి జిల్లాలోని విలేకరులు నవ తెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -