Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి

విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలి

- Advertisement -

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల్లో బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాల స్థాయి వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలనీ, విద్యా బోధనలో నాణ్యతా ప్రమాణాలు పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విద్యాశాఖపై సంబంధిత ఉన్నతాధికారులతో బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, డిజిటల్‌ విద్య, ఇంటర్‌మీడియట్‌, డిగ్రీ కాలేజీల్లో పనితీరు, యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఉన్నత విద్యా సంస్థలు, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో రిటైర్డ్‌యిన అనుభవమున్న ఫ్రోపెసర్లు, లెక్చరర్లు, టీచర్లతో విద్యార్థులకు తరుచుగా మూఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. దీంతో విద్యార్థుల్లో సృజానాత్మకత, మోటీవేషన్‌, మంచి ఆలోచనలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. కేజీబీవీ వివిధ సంక్షేమ వసతి గృహాల్లో ఒక వసతి గృహాన్ని ఎంపిక చేసుకుని అందులో సోలార్‌ మోడల్‌ తరహా కిచెన్‌, స్టోరేజ్‌ రూమ్‌లు, మౌలిక వసతులు, త్రాగునీరు, టాయిలెట్‌లు, విద్యుత్‌, ఇంటర్నెట్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేసి మోడల్‌ హాస్టల్‌గా రూపొందించాలని సూచించారు. కళాశాల స్థాయిలో కెరీర్‌ గైడెన్స్‌ తరగతులు నిర్వహించాలనీ, బీఈడీ కోర్స్‌ పూర్తి చేసిన విద్యార్థులతో ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో బోధన చేయించాలని సూచించారు. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ దేవసేన, ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటి ప్రత్యేక కార్యదర్శి భవేష్‌ మిశ్రా , పాఠశాల విద్యా సంచాలకులు నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -