Wednesday, August 13, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్లు 11,638

ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్లు 11,638

- Advertisement -

– ఎప్‌సెట్‌ తుది విడతలో 80,011 మందికి సీట్ల కేటాయింపు
– 51 కాలేజీల్లో వంద శాతం సీట్ల భర్తీ
– సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు 12
– 18,19 తేదీల్లో అంతర్గత స్లైడింగ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్‌సెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో భాగంగా ఆదివారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ శ్రీదేవసేన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్‌సెట్‌ ధ్రువపత్రాల పరిశీలనకు 97,369 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. తుదివిడతలో 40,837 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 180 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 91,649 సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఎప్‌సెట్‌ తుది విడతలో 80,011 (87.3 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. తుది విడతలో కొత్తగా 4,720 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 20,028 మంది స్లైడింగ్‌ చేసుకున్నారని వివరించారు. ఎప్‌సెట్‌లో ఇంకా 11,638 (12.7 శాతం) మిగిలాయని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 6,085 మంది సీట్లు పొందారని పేర్కొన్నారు. ఐదు యూనివర్సిటీలు, 46 ప్రయివేటు కాలేజీలు కలిపి మొత్తం 51 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసేందుకు ఈనెల 12వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు. కేటాయించిన కాలేజీలో జిరాక్స్‌ ప్రతులతోపాటు ఒరిజినల్‌ టీసీని ఇవ్వాలని కోరారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయకుండా కాలేజీలో రిపోర్టు చేయకుంటే సీట్లు రద్దవుతాయని స్పష్టం చేశారు. ఈనెల 11 నుంచి 13 వరకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈనెల 18,19 తేదీల్లో కేంద్రీకృత ఆన్‌లైన్‌ స్లైడింగ్‌ విధానం ఉంటుందని వివరించారు. ఆ కాలేజీలో బ్రాంచ్‌ మార్పు చేసుకునేందుకు అవకాశముందని తెలిపారు. ఆ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సౌకర్యం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం https://tgeapcet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.
సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో మిగిలిన సీట్లు 5,261
కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) అనుబంధ కోర్సులకు భారీగా ఆదరణ ఉన్నది. ఆయా కోర్సుల్లో చేరేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. సీఎస్‌ఈ, ఐటీ అనుబంధ కోర్సుల్లో 65,080 సీట్లుంటే, 59,819 (91.92 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 5,261 సీట్లు మిగిలాయి. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో 17,754 సీట్లకుగాను 14,118 (79.52 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,636 సీట్లు మిగిలాయి. సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సుల్లో 7,675 సీట్లుంటే, 5,236 (68.22 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 2,439 సీట్లు మిగిలిపోయాయి. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 1,140 సీట్లుంటే, 838 (73.51 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 302 సీట్లు మిగిలాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img