గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలి
ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరించాలి
వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మొదటగా పోలీస్ స్టేషన్ల వారిగా పెండింగ్ కేసుల వివరాలు,నమోదు అయిన కేసులలో నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులు, స్టేషన్ల పరిధిలో నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై ఎస్పీ మహేష్ బి గితే అధికారులతో సమీక్షా జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కేసుల పరిష్కార శాతాన్ని మరింతగా పెంచి నిందుతులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలన్నారు.ప్రతి రోజు పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అధికారులు సిబ్బంది పట్టణాలు, గ్రామాలు సందర్శిస్తూ ప్రజలతో తస్సబంధాలు కొనసాగిస్తూ గ్రామాల్లో ఏ చిన్న సంఘటన జరిగిన త్వరగా ఉన్నతాధికారులకు చేరేలా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ పటిష్టం చేయాలని,ప్రజల భద్రత,నేరాల నియంత్రణలో ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాల్లో నగదును కోల్పోయి,భాధితులు వెంటనే స్పందించి ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించి వారికి అండగా ఉండాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి(బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలను నడుపుతూ,మైనర్ డ్రైవింగ్ చేస్తూ,ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారి గురించి నిరంతరం వాహన తనిఖీలు చేపట్టి పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈసమావేశంలో వేములవాడ అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్., సి.ఐ లు వీరప్రసాద్,శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి,ఎస్.ఐ కు,ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కేసుల పరిష్కార శాతాన్ని పెంచాలి: ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES