తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఏఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సృజన్ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అనుప్ చంద్రశేఖరన్, సాధిక్ షేక్, నవీన్ సనివరపు ఈ వెంచర్‌ను తెరకెక్కించారు. కిషోర్ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
జనవరి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా విడుదలై సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో తరుణ్ భాస్కర్ మీడియాతో ముచ్చటించారు.
-రీమేక్స్ పూర్తిగా తగ్గిపోతున్న ఈ సందర్భంలో ఈ సినిమాతో మంచి రెస్పాన్స్ అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూసిన ఆడియన్స్ ఒరిజినల్‌గా ఫీల్ అవుతున్నారు. కనెక్ట్ అవుతున్నారు.
-మన తెలుగు నేటివిటికి తగ్గట్టు గోదావరి ప్రాంతాలకు తగ్గట్టు అడాప్టేషన్ చేసుకున్నాం. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడానికి ఒక మంచి కథ కావాలి. అలాంటి కథ ఇచ్చినప్పుడు ఆడియన్స్ కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారని ఈ సినిమా మరోసారి నిరూపించింది.
-ఓంకార్ నాయుడు పాత్ర కోసం చాలా హోంవర్క్ చేశాను. యాస విషయంలో, బాడీ లాంగ్వేజ్‌లో కానీ అలాగే బిహేవియర్‌లో.. ఇది నా పర్సనల్ లైఫ్‌కి చాలా డిఫరెంట్‌గా ఉండే క్యారెక్టర్.
-ఈ పాత్ర చాలా భిన్నమైనది. తనకి చేపలు వ్యాపారం ఉంటుంది. అలాగే తండ్రి చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్నంతా తనే మోస్తున్న ఫీలింగ్‌లో ఉంటాడు. ఆ క్యారెక్టర్ పట్టుకోవడానికి చాలా హోంవర్క్ చేశాను. ఆ ప్రాసెస్‌లో చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇది మోస్ట్ సాటిస్ఫైయింగ్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.
రెస్పాన్స్ సూపర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



