. మండల విద్యాధికారి శ్రీహరి ..
నవతెలంగాణ – గాంధారి : గాంధారి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యలో సామర్థ్యాల అభివృద్ధికి నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గాంధారిలో నిర్వహించ బడుతున్నాయి. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీహరి మాట్లాడుతూ ..ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించుటకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తం గా నిర్వహించబడుతున్నాయి. విద్యార్థుల్లోని వ్యక్తిగత విభేదాలు గుర్తించి వారికి అనుగుణంగా పాఠశాలలో బోధించుటకు కావలసిన సామర్థ్యాలను ఉపాధ్యాయులకు అందించుటకు ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది. తద్వారా పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా పాఠశాల విద్యార్థుల నమోదు పెరుగుటకు దోహదపడుతుంది. అలాగే తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల, పట్ల ప్రభుత్వ బడుల పట్ల నమ్మకం కలిగి తమ పిల్లలను పాఠశాలలో చేర్పించుటకు అవగాహన కలుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో నమోదును పెంచి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ఉపాధ్యాయులది అని మండల విద్యాధికారి శ్రీహరి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల స్థాయి ఆర్ పి లు , సిఆర్పిలు టెక్నికల్ పర్సన్ మండలంలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రాథమిక విద్యాభివృద్ధి బాధ్యత ఉపాధ్యాయులదే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES