Wednesday, March 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు గుణపాఠం తప్పదు

రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు గుణపాఠం తప్పదు

- Advertisement -

– కామారెడ్డి బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు
నవతెలంగాణ –  కామారెడ్డి

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా నిధులను విడుదల చేయాలని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ మాట్లాడుతూ రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్‌కు ప్రజాక్షేత్రంలో తప్పకుండా గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

రైతులకు చెల్లించాల్సిన మూడు విడతల రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, భవిష్యత్తులో  రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు భిక్నూర్ మండల అధ్యక్షుడు రంజిత్ వర్మ, దోమకొండ మండల అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు లష్కర్ నాయక్, కామారెడ్డి మండల ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, పాల్వంచ మండల అధ్యక్షుడు దేవరాజ్, రామారెడ్డి మండల నాయకుడు సతీష్, రాజంపేట మండల నాయకుడు రామ్మూర్తి గౌడ్, కామారెడ్డి పట్టణ ఉపాధ్యక్షుడు చంద్రకాంత్, కోశాధికారి సాయి, ప్రచార కార్యదర్శి సంగమేశ్వర్, మండల నాయకులు పరుశురామ్ గౌడ్, బాబా గౌడ్, సమీర్, సాయి, గఫార్, భాను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -