Monday, September 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యాహక్కు చట్టాన్ని సవరించాలి

విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి

- Advertisement -

ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23 (2)ను సవరిస్తూ, టెట్‌ పరీక్ష నుంచి మినహాయింపునిస్తూ చట్టాన్ని సవరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. కిషన్‌ రెడ్డి స్పందిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా ఏకీకృత సర్వీస్‌ నిబంధనల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర హౌంశాఖ నుంచి ఉత్తర్వులు ఇప్పిస్తానని మాటిచ్చారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ రెడ్డి, నాయకులు నవీన్‌ రెడ్డి, గిరిధర్‌ తదితరులున్నారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -