- Advertisement -
అదమరిస్తే అంతే..
నవతెలంగాణ -రెంజల్: రెంజల్ మండలంలోని దండిగుట్ట నుంచి దూపల్లి గేటు వరకు గల రోడ్డు గుంతల మయమై వాహనదారులకు శాపంగా మారింది. రోడ్డు మధ్య భాగంలో గుంతలు ఏర్పడి నీరు నిండిపవడంతో తెలియని వాహనదారులు గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులు గండిగుట్ట క్రాసింగ్ నుంచి దూపాల్ గేటు వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుంది. మండల కేంద్రం నుంచి వచ్చే ప్రతి వాహనం నవీపేట గుండా రెండు కిలోమీటర్ల దూరం అయినా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్ అండ్ బి అధికారులు వెంటనే స్పందించి రోడ్డు ప్యాచ్ వర్క్ అయిన పూర్తి చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -