Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుదేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకం

- Advertisement -

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

దేశ ఆర్థిక వ్యవస్థలో సహకార బ్యాంకుల పాత్ర కీలకమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో అగ్రసేన్‌ బ్యాంక్‌ అమీర్‌పేట బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు ఆర్థిక సేవలను అందించడంలో సహకార బ్యాంకులు ముందున్నాయని అన్నారు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక 2024 ప్రకారం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల మందికిపైగా ప్రజలు వీటి సేవలను వినియోగించుకు ంటున్నారని చెప్పారు. మొత్తం డిపాజిట్లు, రుణాలు రూ. 5.5 లక్షల కోట్ల మార్కును దాటాయని వివరించారు. ఒకప్పుడు బ్యాంకులంటే కేవలం డబ్బుల డిపాజిట్‌, విత్‌డ్రా మాత్రమే అనుకునేవారనీ, కానీ
(మొదటిపేజీ తరువాయి)
నేడు వాటి నిర్వచనం మారిందని అభిప్రాయపడ్డారు. ఖాతాదారుల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా టెక్నాలజీని మిళితం చేస్తూ మార్పులను అందిపుచ్చుకుంటూ వివిధ రకాల సేవలను అందిస్తున్నాయని కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహకార బ్యాంకుల అభివృద్ధికి, పాలసీ సపోర్ట్‌, యాక్సెస్‌ టూ డిజిటల్‌ టూల్స్‌, ట్రైనింగ్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌, హైబ్రిడ్‌ ఫైనాన్స్‌ ఎకోసిస్టమ్స్‌(పీఏటీహెచ్‌) మోడల్‌ను అనుసరిస్తుందని చెప్పారు. యువత, వెనుకబడిన వర్గాలకు స్వయం ఉపాధి రుణాలు, మహిళా స్వయం సహాయక బృందాలకు రుణ అనుసంధానాలు, గ్రీన్‌ లోన్స్‌ వంటి పథకాలను ప్రోత్సహిస్తున్నామని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కార్య క్రమంలో తెలంగాణ అగర్వాల్‌ సమాజ్‌ ప్రెసిడెంట్‌ అనిరుధ్‌ గుప్తా, టిబారుమల్‌ జ్యూవెల్స్‌ ప్రయివేటు లిమిటెడ్‌ రాంభరోసే గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad