Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మట్టిలో మాణిక్యం ఇప్ప వర్షిత 

మట్టిలో మాణిక్యం ఇప్ప వర్షిత 

- Advertisement -

నవతెలంగాణ – నవాబుపేట
మట్టిలో మాణిక్యం ఇప్పటూరు గ్రామానికి చెందిన ఇప్ప వర్షిత మండల పరిధిలోని కూచూరు గ్రామానికి చెందిన ఇప్ప వర్షిత ఇంటర్మీడియట్ లో రెండో సంవత్సరం కూడా తన సత్తా మరొకసారి చాటింది. గత ఏడాది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 467 మార్కులు సాదించి రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం రెండో సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబర్చి 1000 మార్కులకు 991 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించింది.

తమ తల్లిదండ్రులకు గౌరవం లభించేలా గ్రామంలో తన తల్లి దండ్రులు ఇప్ప సువర్ణ, చెన్నయ్య లు కష్టపడి జీవనం సాగిస్తున్న తమ కుమార్తె చదువుకు అండగా నిలిచారు. వర్షిత తనకు తల్లిదండ్రులకు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నా విధ్యపై ఆసక్తి చూపుతూ క్రమశిక్షణ ఏకాగ్రత తో చదువును కొనసాగిస్తూ వర్షిత ఈ ఘనత సాధించిన విషయంపై గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు మేధావులు వర్షితను అభినందనలు తెలిపి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా వర్షిత మాట్లాడుతూ.. తాను మెరుగైన ఫలితాలు సాధించడానికి కారణమైన తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువులు, అధ్యాపకులు ఇచ్చిన మార్గదర్శకాలు తన కృషి ఈ స్థాయికి ఎదిగానని ఆనందం వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -