కొనసాగుతున్న రికార్డ్ కనిష్టం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ రోజు రోజుకు కొత్త కనిష్టాలను చవి చూస్తోంది. శుక్రవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 9 పైసలు పతనమై 90.41కు పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్‌లో ఉదయం 90.43 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 24 పైసలు కోల్పోయి 90.56కు చేరి ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టాన్ని చవి చూసింది. గురువారం 38 పైసలు తగ్గి 90.32 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 0.02 శాతం తగ్గి 61.27 డాలర్లుగా నమోదయ్యింది. తరలిపోతున్న విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు భారత కరెన్సీకి విలువ లేకుండా చేస్తోన్నాయి. గురువారం సెషన్‌లో భారత స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,020.94కోట్ల ఎఫ్‌ఐఐలు తరలిపోయాయి. అమెరికా, భారత్ మధ్య చోటు చేసుకుంటున్న టారిఫ్ ఆందోళనలు, దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఒత్తిడి రూపాయి విలువను అగాథంలోకి నెట్టుతోంది.
రూ’పాయె’
- Advertisement -
- Advertisement -



