నవతెలంగాణ మిర్యాలగూడ
ఈ నెల 17న నల్గొండ జిల్లా కేంద్రం నాగార్జున కళాశాలలో జరగనున్న యాదవ సదరం సమ్మేళనం కార్యక్రమంను విజయవంతం చేయాలని సమ్మేళనం నిర్వహకులు యాదవ బలగం జిల్లా అధ్యక్షులు మేకల యాదన్న యాదవ్, కార్యనిర్వాహకులు దొంగరి శివ కుమార్ యాదవ్ లు కోరారు. బుధవారం స్థానిక బీసీ భవన్ లో సదరం సమ్మేళనం వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. యాదవ సంస్కృతి, సంప్రదాయాలు వివరించేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యాదవ సోదరులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చే గొండి మురళి యాదవ్, దా సరాజు జయరాజు,చింతలచెరువు లింగయ్య యాదవ్, బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాలోత్ దశరథ నాయక్, డాక్టర్ రాజు సామాజికవేత్త, చిర్ర మల్లయ్య , జవాజి సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చిరంజీవి, ఊరీబండి శీను యాదవ్, చి మట శ్రీనివాస్ యాదవ్, కొండా రాంబాబు,పట్టణ అధ్యక్షులు క్రాంతి, దారం మల్లేష్, బిక్షం, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.



