- Advertisement -
కాలానివాసుల దాహర్తి తీర్చడంపై హర్షం
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని హోన్నజీపేట గ్రామ సర్పంచ్ మద్దికుంట ఆశవ్వ- రాఘవేందర్ ఎన్నికల సందర్భంలో కాలనివాసులకు ఇచ్చిన మాటకు కట్టుబడి, తన సొంత ఖర్చులతో వార్డు సభ్యులను వెంట తీసుకెళ్లి, గ్రామములోని కుర్మ కాలానివాసులకు త్రాగు నీటి సౌకరర్థం బోరును వేయించారు. చెప్పిందే తడవుగా గెలిచినా 20 రోజుల్లో కాలానివాసుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడతో కాలానివాసులు హర్షం వెక్తం చేస్తిన్నారు. కార్యక్రమములో గ్రామసర్పంచ్ మద్దికుంట ఆశవ్వ, ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు రాఘవేందర్, ఇతర వార్డు మెంబర్లు, కాలానివాసులు పాల్గొన్నారు.
- Advertisement -



