రూ.40 లక్షలు పెట్టినా.. పైసా రాలేదు
నవతెలంగాణ – రామారెడ్డి
ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు అప్పుసప్పు చేసి చేపడితే.. 2 సంవత్సరాల 6 నెలలు గడిచినా డబ్బులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఆవేదనకు గురై బడికి తాళం వేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో మన ఊరు మనబడి క్రింద 4 గదులు రూ.80 లక్షల నిధులతో భవనం మంజూరయ్యాయి. అదే గ్రామానికి చెందిన లింభారెడ్డి జూలై 2023లో పనులు ప్రారంభించి, రూ.40 లక్షల పనులు పూర్తిచేసి 2 సంవత్సరాల 6 నెలలు అవుతున్న ఒక రూపాయి కూడా మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పాఠశాల భవనానికి తాళం వేసి నిరసన తెలిపినట్లు ఆయన తెలిపారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి రాజును నవతెలంగాణ వివరణ కోరగా ఘటన దృష్టికి రాలేదని తెలిపారు.
బిల్లులు రాలేవని బడికి తాళం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



