Thursday, April 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడి ప్రతాపం కనిపిస్తోంది. రెండు ఆవర్తన ద్రోణుల ప్రభావంతో వచ్చే వారంపాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే మూడ్రోజులు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 41.6 డిగ్రీలు నమోదైంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -