Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఏసీబీకి పట్టుబడిన సీనియర్‌ అసిస్టెంట్‌

ఏసీబీకి పట్టుబడిన సీనియర్‌ అసిస్టెంట్‌

- Advertisement -

సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ కోసం రూ.2లక్షలు లంచం

నవతెలంగాణ- ఆదిలాబాద్‌
సాదాబైనామా కింద భూమి రిజిస్ట్రేషన్‌ చేసేందుకు బాధితుని నుంచి రూ.2లక్షలు లంచం తీసుకుంటూ తహసీల్దార్‌ కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలో శుక్రవారం జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బాలన్‌పూర్‌ శివారులో ఉన్న 8.35 ఎకరాలకు సంబంధించి సాదాబైనామా రిజిస్ట్రేషన్‌ కోసం బాధితుడు తహసీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించాడు. రిజిస్ట్రేషన్‌ దస్తావేజును ప్రాసెస్‌ చేసి పంపించేందుకు సీనియర్‌ అసిస్టెంట్‌ కటకం విద్యాసాగర్‌రెడ్డి లంచం డిమాండ్‌ చేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల సూచన మేరకు విద్యాసాగర్‌రెడ్డికి రూ.2లక్షలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. సీనియర్‌ అసిస్టెంట్‌పై కేసు నమోదు చేసి కరీంనగర్‌ కోర్టులో హాజరు పరిచినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -