నవతెలంగాణ – గండీడ్
విద్యార్థి జీవితంలో గురువుల సేవలు మరువ లేనివని మాజీ వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన మొదటి గురువు అయిన రిటైర్డ్ఉపాధ్యాయులు బంటు నర్సప్ప, సతీమణి భారతమ్మ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వెంకటేష్ గౌడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెన్నచెడ్ ఉపాధ్యాయుడు సాయిలు గౌడ్, అదేవిధంగా వెన్నచెడ్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థికి దశ నిర్దేశం చేసేది గురువేనని,దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం గురువులకు మాత్రమే లభిస్తుందన్నారు. కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ గౌడ్,జిన్నారం మాజీ సర్పంచ్ ఉప్పరి గోపాల్, భద్రేశ్వర్, బంటు సాయిలు, రాములు గౌడ్, బలిజే శ్రీశైలం, కృష్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
గురువుల సేవలు మరువలేనివి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES