మానవ హక్కుల సహాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సలీమ్
నవతెలంగాణ – కామారెడ్డి
పోలీసుల సేవలు మరువ లేనివని మానవ హక్కుల సహాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సలీమ్ అన్నారు. శనివారం హుమాన్ రైట్ హెల్ప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏఎస్పీ చైతన్య రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు నిరంతరం రాత్రి అనక పగలనక కష్టపడి పని చేస్తున్నారన్నారు. పోలీసుల సేవలు మరువలేనివని ప్రజల కోసం నిరంతరం అండగా ఉంటూ పని చేస్తున్నారన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కామారెడ్డి పోలీసుల సేవలు అభినందనీయమన్నారు.
పోలీస్ సేవలకు గాను పుష్పగుచ్చ మిచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ ఈక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏఎస్పీ చైతన్య రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ దేశసేవకే ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో హుమన్ రైట్స్ మహిళా చైర్మన్ షబానా, ఉమెన్ రైట్స్ రాష్ట్ర సలహాదారు కేతు రమణారెడ్డి, జోనల్ అధ్యక్షుడు ప్రదీప్, జిల్లా అధ్యక్షులు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, కామారెడ్డి మహిళా కార్యదర్శి సట్ల జమున, కార్యదర్శి అనిత, పట్టణ మహిళా అధ్యక్షురాలు అల్స బేగం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వి భాస్కర్, కార్యదర్శి షేక్ జావిద్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల సేవలు మరువలేనివి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES