Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవెల్‌నెస్‌ సెంటర్లలో మందుల కొరత తీర్చాలి

వెల్‌నెస్‌ సెంటర్లలో మందుల కొరత తీర్చాలి

- Advertisement -

ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వెల్‌ నెస్‌ సెంటర్లలో మందుల కొరతను తీర్చాలని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్‌ రెడ్డి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం వారు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా చొంగ్తూను కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి షుగర్‌, బీపీ మందుల కొరత ఉందని వారు తెలిపారు. తగిన చర్యలు తీసుకుంటామని చొంగ్తూ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. సెంటర్లలో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రొఫెసర్లు, వైద్యులు అందుబాటులో ఉన్నారు. మిగిలిన 22 జిల్లాల్లో వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయనీ, నెల రోజుల్లో వాటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -