యూఎన్ సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరిక.. శాంతిచర్చలకు దౌత్యవేత్త నియామకం
న్యూయార్క్ : యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు చేయి దాటిపోయాయని ఐక్యరాజ్యసమితి (యూఎన్) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. వెంటనే అన్ని పక్షాలూ సైనిక ఘర్షణను ఆపి, దౌత్యమార్గాల్లో సంప్రదింపులు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధాన్ని ఆపే శాంతి చర్చల కోసం సీనియర్ దౌత్యవేత్త జీన్ అర్నాల్ట్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విలేకరులతో మాట్లాడుతూ ఆంటోనియో గుటెరస్ ఈ వివరాలను వెల్లడించారు.
నేతల అంచనాలను మించి సైనిక ఘర్షణ
ప్రపంచ దేశాల నేతలు అంచనా వేసిన దాని కంటే అతి తీవ్రస్థాయికి పశ్చిమాసియా సైనిక ఘర్షణ చేరిందని ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఈ యుద్ధాన్ని ఆపే దిశగా ఐక్యరాజ్యసమితి చేసే ప్రయత్నాలకు తన వ్యక్తి గత రాయబారిగా సీనియర్ దౌత్యవేత్త జీన్ అర్నాల్ట్ వ్యవహరిస్తారని ఆయ న వెల్లడించారు. ఈ యుద్ధం చేస్తున్న దేశాల నడుమ మధ్యవర్తిత్వానికి, శాంతి చర్చలకు జీన్ అర్నాల్ట్ అన్ని రకాలా సహాయ, సహకారాలను అందిస్తారన్నారు. అంతేగాక యుద్ధ ప్రభావాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, అన్ని పక్షాలతో చర్చలు జరుపుతారని తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధం ఆ ప్రాంతంతో పాటు మొత్తం ప్రపంచంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందని వివరించారు. ప్రత్యేకించి హార్ముజ్ జలసంధిపై ఆధారపడిన ఇంధన మార్కెట్లు బాగా ప్రభావితం అవుతున్నాయని ఆయన చెప్పారు. ”ఈ యుద్ధం వల్ల యావత్ పశ్చిమాసియా ప్రాంతంలోని ప్రజలు పెను ముప్పు ను ఎదుర్కొంటున్నారు. వాళ్లంతా గాఢమైన అభద్రతా భావంలో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేకించి లెబనాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ యుద్ధాన్ని తప్పకుండా ఆపాలి. లెబనాన్‌లోని సామాన్య ప్రజలు లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులను ఆపేయాలి. యావత్ ప్రపంచం ప్రభావితం అవుతుండటంతో అన్ని మార్కెట్లు అస్తవ్యస్తమవుతున్నాయన్నారు.
పశ్చిమాసియాలో పరిస్థితులు చేయి దాటిపోయాయ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



