Monday, March 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదు

కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదు

- Advertisement -

25న పార్టీ సభ్యత్వానికి రాజీనామా : మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

నవతెలంగాణ – జగిత్యాల
కాంగ్రెస్‌ పార్టీలో తాను ఇకపై కొనసాగే పరిస్థితి లేదని సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగే పరిస్థితులు లేవని, ఈ నెల 25న సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 20నెలలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు తనను ఈ నిర్ణయానికి తీసుకొచ్చాయని, మానసిక క్షోభను అనుభవించానని తెలిపారు. నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవడం బాధాకరమని, అయినప్పటికీ తన సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. శాసన మండలిలో ఒంటరి పోరాటం చేశానని, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడి పోరాడినట్టు గుర్తు చేశారు.

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పరిస్థితులు క్లిష్టంగా మారాయని తెలిపారు. పార్టీ కార్యకర్తల హక్కులను కాలరాస్తున్నారని, గౌరవం లేని చోట కొనసాగడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ నెల 25న బండారి గార్డెన్‌లో అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంలో ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ నిర్మాణంలో జాప్యం వల్ల ఉత్తర తెలంగాణకు కరువు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఈ ప్రాజెక్టును విస్మరించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో తన స్వేచ్ఛకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నానని, ఈ నెల 25న కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -