కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ ‘స్వయంభు’తో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించిన భారీ పాన్-వరల్డ్ విజువల్ వండర్‌ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. మేకర్స్ పవర్ ఫుల్ టీజర్‌తో ప్రమోషన్‌లను ప్రారంభించారు. ఈ టీజర్ అంచనాలను భారీగా పెంచింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లో 3డి ఫార్మాట్‌లో ప్రదర్శించిన ఈ టీజర్‌ను చూసినవారు విజువల్ గ్రాండియర్‌కు మెస్మరైజ్ అయ్యారు. సమ్మర్ రిలీజ్‌ను అఫీషియల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో పాన్-వరల్డ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. హీరో నిఖిల్ మాట్లాడుతూ,”హ్యాపీ డేస్’ వచ్చి 19 సంవత్సరాలు అవుతోంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి.
కానీ అందరూ నాకు సపోర్ట్ చేశారు. ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా విజయం తర్వాత దానికంటే అద్భుతమైన ప్రాజెక్ట్‌తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో, భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి కథని బెస్ట్ టెక్నీషియన్స్‌తో చేశాం. సెంథిల్ ఫ్రేమ్‌లో కనిపిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఫ్రేమ్‌లో నేను కనిపించడం చాలా ఆనందంగా ఉంది. అలాగే రవి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇంత మంచి టెక్నీషియన్స్ ఇచ్చిన మా మధుకి కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం భువన్, డైరెక్టర్ భరత్. ఈ టీజర్ కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. కథలో చాలా మలుపులు ఉన్నాయి. ముందు ముందు వచ్చే కంటెంట్‌లో మరింత రివీల్ చేస్తాము. త్రీడీలో చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను.
ఈ సినిమా 3డిలో రాబోతుంది. మీరందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు’ అని తెలిపారు. ‘నిర్మాత మధుకి థ్యాంక్స్. ఒక డెబ్యు దర్శకుడితో ఇంత పెద్ద ప్రాజెక్ట్ నమ్మి, నిర్మించడం మామూలు విషయం కాదు. నిఖిల్ అద్భుతమైన డెడికేషన్‌తో పని చేశారు. పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ద బెస్ట్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది’ అని డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి చెప్పారు. డిఓపి సెంథిల్ కుమార్ మాట్లాడుతూ,’ఈ సినిమాలో భాగం కావడం చాలా ఫ్రౌడ్‌గా ఉంది. ఇది చాలా ఇన్స్పిరేషనల్ ఫిలిం. కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చూపించే కథ. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది’ అని తెలిపారు. ‘నిఖిల్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. అలాగే దర్శకుడు చాలా రీసెర్చ్ చేశారు. ఆయన కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయా. అందరి అంచనాలకు తగినట్లే భారీ స్థాయిలో ఈ సినిమా ఉంటుంది’ అని హీరోయిన్ సంయుక్త చెప్పారు.
మరో హీరోయిన్ నభా మాట్లాడుతూ, ‘సినిమా అదిరిపోతుంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. నిర్మాత మధు ఇంటి అమ్మాయిలాగా చూసుకున్నారు. ఆయనతో మరో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది’ అని తెలిపారు. నిఖిల్, సంయుక్త, నభా నటేష్, సుబ్బరాజు, సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: భరత్ కృష్ణమాచారి, నిర్మాతలు: భువన్, శ్రీకర్, సమర్పణ: ఠాగూర్ మధు, డీఓపీ : కె.కె.సెంథిల్ కుమార్, సంగీతం: రవి బస్రూర్, ఎడిటర్: తమ్మిరాజు, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, ప్రొడక్షన్ డిజైనర్లు: ఎం ప్రభాహరన్, రవీందర్, యాక్షన్: కింగ్ సోలమన్, స్టంట్ శివ, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి.
మనమంతా ఇంత స్వేచ్ఛగా ఉండడం వెనక ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి. అందరూ రాజుల గురించి మాట్లాడతారు కానీ ప్రాణ త్యాగాలు చేసిన వారియర్స్ గురించి మాట్లాడుకోరు. 1000ఏళ్ల క్రితం మన చిత్తూరు రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే వారియర్ ఉన్నాడు. అతడి కథ ఇది. అల్లరిగా తిరిగే ఓ అండర్ డాగ్.. రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చూపించాం. ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన కథ. డైరెక్టర్ చాలా రీసెర్చ్ చేసుకొని ఈ కథను తీసుకొచ్చారు. ఇంతలో నేను ఒక అండర్ డాగ్‌గా కనిపిస్తాను. ఓ అండర్ డాగ్ ఏం సాధించాడనేది ఈ సినిమాలో బెస్ట్ విజువల్స్, మ్యూజిక్‌తో చూస్తారు. -హీరో నిఖిల్



