Tuesday, September 16, 2025
E-PAPER
Homeసినిమావిజయం సాధించిన ప్రతి ఒక్కరి కథ

విజయం సాధించిన ప్రతి ఒక్కరి కథ

- Advertisement -

కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌, ఎస్‌ జే కే బ్యానర్స్‌ పై ఎమ్‌వీ రాధాకష్ణ, జేమ్స్‌ డబ్యూ కొమ్ము తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ దర్శకత్వం వహించారు. ఈనెల 19న తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్‌ ల్యాబ్స్‌లో మేకర్స్‌ నిర్వహించిన పీ రిలీజ్‌ ఈవెంట్‌లో దర్శకుడు రవి బస్రూర్‌ మాట్లాడుతూ,’ఇదొక రూటెెడ్‌ స్టోరీ. యక్షగానం కల్చర్‌ను రిప్రజెంట్‌ చేసేలా ఉంటుంది. ఈ సినిమా నా 12 ఏళ్ళ కల. విజయం సాధించిన ప్రతి ఒక్కరి స్టోరీ ఇది. జీరో నుంచి హీరోగా ఎలా అవుతారు అనే డెడికేషన్‌ ఈ కథలో ఉంటుంది. ఇది నా ఆరో సినిమా. యక్షగాన కళతో రూపొందిన ఈ చిత్రంతో ఒక కొత్త ప్రపంచాన్ని సష్టించాను. మన కల్చర్‌ను కాపాడుకునేలా ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు. ‘ఇటీవల కన్నడలో విడుదలై అఖండ విజయం సాధించిన ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంది.

ఈ మధ్య కాలంలో 100 డేస్‌ రన్‌ అయిన సినిమాగా ఇది మంచి గుర్తింపు పొందింది. ఈ చిత్రాన్ని మేం తెలుగులో విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ నాగరికత సంస్కతికి సంబంధించిన యక్షగానం అనే కాన్సెప్ట్‌తో రూపొందింది. ‘కేజిఎఫ్‌, సలార్‌’ లాంటి చిత్రాలకు తనదైన సంగీతంతో అలరించిన రవి బస్రూర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే సంగీతం అందించారు. కన్నడలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తుంది. తెలుగులో కూడా ‘వీర చంద్రహాస’ విజయదరహసం ఖాయమని నమ్ముతున్నాం’ అని నిర్మాత ఎమ్‌.వీ.రాధాకష్ణ చెప్పారు. జేమ్స్‌ డబ్యూ కొమ్ము మాట్లాడుతూ, ‘లెజెండ్రీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌తో స్టేజ్‌ షేర్‌ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆయన సొసైటీ మీద ప్రేమ ఉన్న వ్యక్తి. బస్రూర్‌ అనే విలేజ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ఈనెల 19 వస్తున్న ఈ చిత్రం కచ్చితంగా అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -