Thursday, January 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌ సుంకాలను సుప్రీంకోర్టు కొట్టేస్తుంది

ట్రంప్‌ సుంకాలను సుప్రీంకోర్టు కొట్టేస్తుంది

- Advertisement -

– అమెరికా మార్కెట్‌లో బెట్టింగ్‌
వాషింగ్టన్‌ :
దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేస్తుందని అమెరికా మార్కెట్‌ అంచనా వేస్తోంది. దీనిపై మార్కెట్‌లో జోరుగా బెట్టింగ్స్‌ నడుస్తున్నాయి. ట్రంప్‌ సుంకాలు చట్టవిరుద్ధమైనవని సుప్రీంకోర్టు రూలింగ్‌ ఇచ్చే అవకాశాలు 73 శాతం వరకూ ఉన్నాయని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ ప్రభుత్వం అత్యవసర అధికారాలను ఉపయోగించుకొని వివిధ దేశాలపై సుంకాలు విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థికాధికారాల చట్టం కింద ప్రభుత్వం తన అధికారాన్ని అతిక్రమించిందా అనే అంశాన్ని న్యాయస్థానం పరిశీలిస్తుంది. ఒకవేళ సుంకాల విధింపును కొట్టివేస్తే దిగుమతిదారులకు ఆ సొమ్మును వాపసు చేయవచ్చా అనే విషయంపై కూడా న్యాయస్థానం పరిశీలన జరుపుతుంది. కాగా తన టారిఫ్‌ విధానంపై వస్తున్న విమర్శలను ట్రంప్‌ తోసిపుచ్చారు. తన ప్రత్యర్థులు చైనా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ సుప్రీంకోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతానని హెచ్చరించారు. ఏదేమైనా సుప్రీంకోర్టు వెలువరించే తీర్పు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సుంకాలే అమెరికాకు ప్రధాన ఆదాయ వనరు అని ట్రంప్‌ పదేపదే చెబుతున్నారు. తాజా త్రైమాసికంలో కస్టమ్స్‌ సుంకాల ఆదాయం పెరిగిందని అమెరికా ఆర్థిక శాఖ డేటా చెబుతోంది. గత సంవత్సరం జనవరిలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్‌ అమెరికా వాణిజ్య భాగస్వాములందరి పైన సుంకాలు విధించారు. ప్రభుత్వ లోటును అధిగమించడానికి టారిఫ్‌ ఆదాయం ఉపయోగపడుతోందని ఆయన చెప్పారు. పన్నులు, సుంకాల పెంపుదలతో అమెరికా బడ్జెట్‌ లోటు తగ్గిపోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -