– కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండదంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగస్ఫూర్తికి అనుకూలంగా లేదని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా న్యాయ స్థానాల ద్వారా మైనార్టీలపై కక్ష తీర్చుకుంటుందని విమర్శించారు. మత స్వేచ్ఛ ఆధ్యాత్మికమైతే కులం సామాజిక సమస్య అని పేర్కొన్నారు. కులాన్ని, హక్కులతో అనుసంధానం చేయడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పుపై పునర్విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పున : సమీక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



