ప్రజాస్వామ్య వ్యతిరేక బిల్లులను ఖండించిన సీపీఐ(ఎం)
చట్టపరమైన విధానాలను తప్పించుకునేందుకు కేంద్రం కుట్ర
న్యూఢిల్లీ : 30రోజుల పాటు కస్టడీలో వుంటే ప్రధాని, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులను వారి పదవుల నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన మూడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా నిరసించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే అమల్లో వున్న చట్టపరమైన విధానాలను తప్పించుకునే ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను ఈ బిల్లు నొక్కిచెబుతోందని పేర్కొంది. గతంలో కూడా బీజేపీ ఇదే రకమైన ధోరణిని కనబరుస్తూ వచ్చిందని, జ్యుడీషియల్ పరిశీలనను తప్పించుకునేందుకు గానూ మొత్తంగా ఒక చట్టాన్ని తీసుకువచ్చే హేయమైన చర్యలను తీసుకుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రస్తుత ప్రభుత్వ నయా ఫాసిస్ట్ ధోరణులను దృష్టిలో వుంచుకుంటే, ప్రతిపక్షాల పాలనలోని రాష్ట్ర ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకునే ఆయుధంగా ఈ చట్టాన్ని ఉపయోగిస్తారని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఈ చర్య చాలా హీనమైనదని, ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన తనిఖీలు, సమతుల్యత లను దెబ్బతీస్తుందని విమర్శించింది. చట్టంగా తీసుకురా వాలన్న ఈ ప్రతిపాదనను అడ్డుకోవ డానికి అన్ని రకాలుగా పోరాటం సల్పాలని సీపీఐ(ఎం) కృతనిశ్చయంతో వుంది. అవాంఛనీ యమైన ఈ చర్యను సంయుక్తంగా ప్రతిఘటిం చేందుకు ప్రతిపక్షంలో భావసారూప్యత కలిగిన ప్రజాతంత్ర, లౌకిక పార్టీలన్నీ కలిసి రావాలని సీపీఐ(ఎం) కోరింది.
ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలే లక్ష్యం
- Advertisement -
- Advertisement -