Monday, February 16, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూడో డిస్కం ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

మూడో డిస్కం ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి

- Advertisement -

– తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మూడో డిస్కం ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఈశ్వర్‌రావు, నలువాల స్వామి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని రెండు డిస్కంలైన ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో పని చేసేందుకే పూర్తి స్థాయి సిబ్బంది లేరనీ, అలాంటి పరిస్థితుల్లో మూడో డిస్కంకు ఎక్కడి నుంచి ఉద్యోగులను తెస్తారని ప్రశ్నించారు. మూడో డిస్కం పేరిట ఉద్యోగులను వేధిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రతిపాదిత డిస్కం పరిధిలో 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 1,132 మిషన్‌ భగీరథ సర్వీసులు, 99 వాటర్‌ బోర్డు సర్వీసులు,489 ఎత్తిపోతల సర్వీస్‌ల ట్రాన్స్‌ఫార్మర్లకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. రెండు డిస్కంల పరిధిలో సిబ్బంది సరిపడా లేకున్నా సంస్థ కోసం రాత్రింభవళ్లు ఉద్యోగులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిస్కం నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -