”ఛాంపియన్’ నుంచి ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ‘గిర గిర..’ సాంగ్ అన్ని ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతూనే ఉండగా, మనసుని కదిలించే సెకండ్ సింగిల్ ‘సల్లంగుడాలే’ కూడా అద్భుత స్పందన అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం నుంచి మూడవ పాటను ఆదివారం అగ్రకథానాయిక సమంత లాంచ్ చేశారు.
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ‘మూడో సింగిల్ ‘ఐ యామ్ ఎ ఛాంపియన్..’ సాంగ్ ఒక ప్రత్యేకమైన, పూర్తి స్థాయి డాన్స్ నెంబర్‌గా అలరించింది. గ్రాండియర్‌తో పాటు రిథ్మిక్ ఎలిగెన్స్‌ను కలిపిన ఈ పాట, భారీ సెట్‌పై, అద్భుతమైన డాన్స్‌లతో కన్నుల పండువైన విజువల్ స్పెక్టాకిల్‌గా నిలిచింది.
ఎనర్జిటిక్ కంపోజిషన్, బలమైన రిథమ్‌తో శ్రోతలను ఆకట్టుకుంటోంది. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనే భావనను ప్రతిబింబించే కేకే సాహిత్యం పాటకు బలం చేకూరుస్తే, పి.జయరామ్, రమ్య బెహరా తమ ఎనర్జిటిక్ వోకల్స్‌తో పాట ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. డాన్స్ ఫ్లోర్‌పై రోషన్ అదరగొట్టాడు. జాజ్ బీట్స్‌కు అనుగుణంగా అతని బాడీ లాంగ్వేజ్, ఎలిగెంట్ మూవ్‌మెంట్స్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. షార్ప్, అనస్వర కూడా అదే ఎనర్జీతో కనిపించింది. పోనీ వర్మ కొరియోగ్రఫీ ఈ పాటకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తూ, స్టైలిష్ హుక్ స్టెప్‌తో పాటు డైనమిక్ డాన్స్ మూవ్స్‌తో విజువల్స్‌ను మరో లెవల్‌కి తీసుకెళ్లింది’ అని చిత్రయూనిట్ తెలిపింది. నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ క్రిస్మస్‌కు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ఈనెల 25న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం, డీఓపీ : ఆర్ మదీ, సంగీతం: మిక్కీ జె మేయర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు.
మూడో పాటగా ‘ఐ యామ్ ఏ ఛాంపియన్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



