Wednesday, July 23, 2025
E-PAPER
Homeమానవిచిట‌ప‌ట చినుకుల్లో వ్యాధుల ముప్పు

చిట‌ప‌ట చినుకుల్లో వ్యాధుల ముప్పు

- Advertisement -

మండే ఎండల తర్వాత వచ్చే వర్షాకాలం చల్లటి వాతావరణాన్ని మోసుకొచ్చినప్పటికీ, అనేక అనారోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. ఈ కాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు త్వరగా వ్యాపిస్తాయి. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని రకాల పండ్లు రోగనిరోధక శక్తిని పెంచి, ఈ సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. మరి ఈ సీజన్‌లో ఎలాంటి పండ్లు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం…
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జలుబు, దగ్గు, మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ, ఇతర అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సీజన్‌లో కొన్ని రకాల పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా కొన్ని రకాల పండ్లు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో పండ్లలో పురుగులు పడతాయి కాబట్టి కాలానుగుణంగా వచ్చే పండ్లను తినడం మంచిదని Aరఱaఅ ×అర్‌ఱ్‌బ్‌వ శీట చీవజూష్ట్రతీశీశ్రీశీస్త్రy Aఅస ఖతీశీశ్రీశీస్త్రy తన అధ్యయనంలో పేర్కొంది.
జామ
వర్షాకాలంలో జామకాయ తినడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు. జామకాయలో విటమిన్‌ సి, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, తద్వారా జీర్ణక్రియ మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శరీరంలోని చెడు బ్యాక్టీరియాను నాశనం చేసి మనల్ని ఎంతో హెల్తీగా ఉంచుతాయి. న్యూట్రిషన్‌, క్యాన్సర్‌ జర్నల్‌లో ప్రచురించిన ఒక జంతు అధ్యయనం ప్రకారం జామకాయ సారం క్యాన్సర్‌ కణాల పెరుగుదలను నిరోధించగలదని కనుగొన్నారు. అలాగే హైపర్‌ టెన్షన్‌తో బాధపడే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. జామలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. జామ గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫోలిక యాసిడ్‌, విటమిన్‌ బి9 పుట్టబోయే బిడ్డ నాడీ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతుంది. దగ్గు, చలి, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి జామ శరీరాన్ని రక్షిస్తుంది.
దానిమ్మ
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, ఇవి శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనతతో బాధపడుతున్నా వారు వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్‌ సి కూడా పుష్కలంగా ఉంటుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దానిమ్మలో కేలరీలు 234, ప్రోటీన్‌ 4.7గ్రాములు, కొవ్వు 3.3 గ్రాములు, కార్బోహైడ్రేట్స్‌ 52 గ్రాములు, ఫైబర్‌ 11.3 గ్రాములు ఉంటాయి. వీటితోపాటు ఫొలేట్‌, మెగ్నీషియం, పొటాషియంలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. వాపు, వృద్ధాప్యంతో పోరాడటానికి సహాయపడతాయని ఓ అధ్యయనంలో తేలింది.
బొప్పాయి
ఈ పండును వర్షాకాలంలో తప్పనిసరిగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పపైన్‌ ఎంజైమ్‌ అనేది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, అంతేకాకుండా రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని పేర్కొన్నారు. అలాగే ఇందులో విటమిన్‌ ఎ, సి పుష్కలంగా ఉంటుందని తెలిపారు. అలాగే బొప్పాయి ఆకుల రసం వల్ల ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతాయని, దీనితో పాటు తలనొప్పి, అలసట వంటి వాటి నుంచి ఉపశమనం కలుగుతుందని వివరించారు. ఇంకా ఇది ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేస్తుంది. కొవ్వు లేకుండా, క్యాలరీలు తక్కువ ఉండే ఈ పండు కంటి రోగాలు రాకుండా తోడ్పడుతుంది. చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో వుండే విటమిన్‌ బి నోటి పూత రాకుండా కాపాడుతుంది. తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
ఆపిల్స్‌
రోజుకు ఒక ఆపిల్‌ తింటే డాక్టర్‌తో పనిలేదంటారు. ఇందులో విటమిన్‌ సి, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందని, వైరల్‌ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. వీటిలో ఫైటోకెమికల్స్‌ అనేవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. ఇందులో ఉన్న ఫైబర్‌ మలబద్ధకం సమస్యకు, బరువు తగ్గడానికి మంచిదని పేర్కొన్నారు. అంతేకాకుండా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఇవి శక్తిని సరఫరా చేయడమే కాకుండా ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక పనితీరు మొదలైన అనేక ముఖ్యమైన ప్రక్రియలలో కూడా పాల్గొంటాయని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసెన్‌ తన అధ్యయనంలో పేర్కొంది.
పియర్‌
దీనిని తెలుగులో బేరీ పండు అంటారు. వీటిలో విటమిన్‌ సి,కె,ఇ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కాల్షియం, ఫొలేట్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియంఈ పండ్లును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు నయమవుతాయంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని వివరించారు. అంతేకాకుండా ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుందని పేర్కొన్నారు. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు మంటను తగ్గించడంలో, టైప్‌ 2 మధుమేహం, స్ట్రోక్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -