కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్
నవతెలంగాణ – మల్హర్ రావు
చలికాలం నేపథ్యంలో ఉదయం, రాత్రి వేళల్లో ఏర్పడే పొగమంచుతో ప్రమాదాలు పొంచి ఉంటాయని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కొయ్యుర్ ఎస్ఐ వడ్లకొండ నరేశ్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన నవ తెలంగాణతో మాట్లాడారు. పొగమంచు వల్ల రోడ్డుపై వాహనాలు, పాదాచారులు, జంతువులు,ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా కనిపించవన్నారు. డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమా దాలను నివారించవచ్చని పేర్కొన్నారు.
వాహనదారులకు ఎస్ఐ సూచనలు ఇలా చేశారు. పొగమంచు కారణంగా గమ్యస్థానానికి వెళ్లడం ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ముందుగానే బయలుదేరితే తొందరపాటు డ్రైవింగ్ నివారించవచ్చు. అతివేగం, ఓవర్ టేకింగ్కు దూరంగా ఉండాలి. లో బీమ్ లైట్లను మాత్రమే ఉపయోగించాలి. ముందు వెళ్లే వాహనానికి తగిన దూరాన్ని పాటించాలి. నిర్దేశిత లేన్లోనే వాహనం నడపాలి. వాహనం నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దించాలి. ముందు, వెనుక అద్దాలను శుభ్రంగా ఉంచు కోవాలి. ఇండికేటర్లను ముందుగానే ఉపయోగించాలి. సడన్ బ్రేకింగ్కు దూరంగా ఉండాలి. రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.



