డిపిఓ సునంద…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం ఓటర్లు 5 లక్షల 32 వేల 218 మంది ఓటర్లు ఉన్నట్టు, అందులో పురుషులు 2 లక్షల64 వేల 567 , శ్రీలు 2 లక్షల 67 వేల 649, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు డిపిఓ సునంద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్రామపంచాయితి ఎన్నికలు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారంగా తేది 28.08.2025 న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించడం జరిగిందనీ , ఇందుకు సంభందించి పార్టీలు ప్రజల నుండి అభ్యంతరములను స్వీకరించడం జరిగిందనీ, ఆగస్టు 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 1517 అభ్యంతరములను స్వీకరించడం జరిగిందనారు. మొత్తం అభ్యంతరములను జిల్లా పంచాయితి అధికారి గ ద్వారా 31.08.2025 వరకు పరిష్కరించడం జరిగిందనీ తెలిపారు. తుది జాబితా ప్రకారం మొత్తం గ్రామా పంచాయితి ఎన్నికల ఓటర్లు 532240 ఇందులో పురుషులు: 264577, స్త్రీలు: 267661, ఇతరులు: 2 ఉన్నట్లు తెలిపారు.
జిల్లాలో మొత్తం ఓటర్లు 5 లక్షల 32 వేల 218..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES