నీళ్లలోనే ఆలయ పరిసరాలు..
ఇంటి నుండి తెప్పలతో బయటకు
నవతెలంగాణ – ముధోల్
భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో బాసర గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో శనివారం కూడా బాసరవాసులకు ఇబ్బందులు తప్పలేదు. గత నాలుగు రోజులుగా వర్షాలు విస్తారంగా కురవటంతో పాటు మహారాష్ట్రలో వర్షాలు భారీగా కురిసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి ప్రాజెక్టులు నిండిపోయాయి. ఈ క్రమంలో ప్రాజెక్టుల గేట్లు త్తివేయడంతో గోదావరి ఉధృతంగా గత మూడు రోజులుగా ప్రవహిస్తోంది. ఆలయ పరిసరాల వరకే శుక్రవారం నీళ్ళు చేరిన విషయం తెలిసిందే. శనివారం వరకు వరద ఉధృతి పెరగడంతో జ్ఞాన సరస్వతి ఆలయ ముందర ఉన్న వ్యాస మహర్షి ఆలయం వరకు, అలాగే రెండవ ఆలయ అర్చీగేటు వరకు, ఇటు గోదావరి నుండి వంద గదుల భవనం వరకు భారీగా వరద నీరు చేరింది.
ఉదృతి పెరగటంతో స్థానికులు ఆందోళన చెందారు. గత మూడు రోజులుగా ఆలయ పరిసరాల్లో ఉన్న లాడ్జిలు, నివాస గృహాలు, ఆలయం ముందరన్న వ్యాపార దుకాణాలు నీట మునిగాయి. తాజాగా శనివారం మరింత ఉధృతి పెరగటంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి స్థానికులు మత్సకారుల సహకారంతో తెప్పలను ఉపయోగిస్తున్నారు. ఇంటి సరుకులు తేవటానికి కుడా తెప్పలను ఉపయోగించుకుంటున్నారు. దీనికి తోడు ఆలయ పరిసరాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు నీట మునగాయి. దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడానికి ఎస్డిఆర్ఎఫ్ బృందాల సహాయంతో వెళ్ళి విద్యుత్ సిబ్బంది విద్యుత్ ను నిలిపివేశారు. దీంతో నీట మునిగి, ఇంట్లో ఉన్నా వారు నీటి సమస్యను ఎదుర్కుంటున్నారు. ఎగువన ఉన్న మహారాష్ట్రలో భారీ వర్షాలతో అక్కడి ప్రాజెక్టులు నిండిపోవడంతో విడతల వారిగా గేట్లు ఎత్తివేయడంతో బాసర గోదావరి ఉధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఉధృతి ఆదివారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
తగ్గని బాసర గోదావరి ఉధృతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES