Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి

వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలి

- Advertisement -

– హక్కుల కోసం పెన్షనర్లు పోరాటం చేయాలి
– డివిజన్ మహాసభలో ఎల్.అరుణ
నవతెలంగాణ – మిర్యాలగూడ 
: పెన్షనర్లకు అన్యాయం చేసే వాలిడేషన్ చట్టాన్ని రద్దు చేయాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్. అరుణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యుటిఎఫ్ భవనంలో ఆ సంఘం డివిజన్ మహాసభ డివిజన్ అధ్యక్షులు జి. సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ దారులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా కొత్తగా రిటైర్మెంట్ అయిన వారికి మాత్రమే బెనిఫిట్ ఇస్తామని వ్యాలిడేషన్ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు. ఈ చట్టం వల్ల పాత పెన్షన్ దారులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈపీఎస్ పెన్షన్ దారులకు కనీస వేతనం 9వేలు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్  బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

పెన్షన్ యాక్ట్ మే 2025ను కేంద్రం వెంటనే రద్దు చేయాలన్నారు. ఈపీఎస్ పెన్షన్ దారులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. గ్రాడ్ డ్యూటీని కేంద్రం చెల్లిస్తున్న మాదిరిగా 20 లక్షలు చెల్లించాలని సూచించారు. సివిపి మినహాయింపులను 12 సంవత్సరాలకు కుదించాలన్నారు. 398 వేతనంతో పనిచేసిన టీచర్లకు నేషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఈ కుబేర్ లో పెండింగ్ బిల్లులను చెల్లించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సమస్యలకు పరిష్కారం కోసం భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పెన్షనర్లు ఐక్యంగా ఉండి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు నూకల జగదీశ్ చంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు వాడపల్లి రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పందిరి శ్యాంసుందర్, డివిజన్ ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పరిమి రామ అవతారం, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జి రామచంద్రరావు, లక్ష్మీనారాయణ, రమణారెడ్డి, సత్యనారాయణ రావు, కేశవులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -