ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి
నవతెలంగాణ – కామారెడ్డి
ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించాలని అలాంటి వారిని మోసం చేయకుండా గ్రామాన్ని అభివృద్ధి పై సిద్ధపెట్టాలని నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులకు ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాత తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని అయిన సొంత గ్రామం జనగామలో ఆదివారం బీబీపేట్ మండలంతోపాటు వివిధ మండలాల్లో గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్లు ఆయన స్వగృహంలో కలిశారు.
వారిని సుభాష్ రెడ్డి శాలువాతో సత్కరించి భవిష్యత్ లో గ్రామాలు అభివృద్ధిలో భాగంగా ఏ విధమైనా సహాయానికైనా తోడ్పాడుతా అని వారికి హామీ ఇచ్చారు. మీరు ఐదేళ్లలో చేసే పనులు మాత్రమే ఎల్లకాలం గుర్తు ఉంటాయని దానిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారికి కావలసిన సహాయ సహకారాలను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బిబిపేట మండలం తో పాటు పలు మండలాల గ్రామ ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు.
ఆ ఇంటి నుండి మూడవసారి సర్పంచ్..
జనగామ గ్రామంలో ప్రస్తుతం సర్పంచ్గా గెలిచిన మట్ట శ్రీనివాస్ వారి ఇంటి నుండి ఈయన ఇది మూడవసారి సర్పంచ్ కావడం. మొదట ఈయన సర్పంచ్ ఆ తర్వాత ఆయన భార్య మళ్ళీ తిరిగి ఆయన సర్పంచిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మంచితనమే తన గెలిపిస్తుందని పేర్కొన్నారు.



