సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ బోనాలు ఆదర్శం
నవతెలంగాణ – పాలకుర్తి
శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని పల్లెలు బోనమెత్తాయి. బుధవారం మండలంలోని పాలకుర్తి, తొర్రూరు, శాతాపురం, అయ్యంగారిపల్లి, గూడూరు, గోపాలపురం, ఈరవెన్ను, ముస్కొల్ల గూడెం, తీగారం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు వెంకటాచారి, మహేష్, కే రాజు, లింగేశ్వర్, మహేందర్, జే సంగీత, శ్రీనివాసరెడ్డి, బక్క మహేందర్ ల పర్యవేక్షణలో బోనాల పండుగను మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామ దేవత అయిన పోచమ్మకు నైవేద్యంతోపాటు బోనాలను భక్తిశ్రద్ధలతో బోనాలను, నైవేద్యాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణలో బోనాలు ఆదర్శమని మహిళలు తెలిపారు. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శులు వెంకటాచారి, మహేష్, చంద్రశేఖర్, పోచమ్మ ఆలయాలను రంగురంగుల పూలతో అలంకరించారు. విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. బోనాల పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. బోనాల పండుగ సందర్భంగా శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. బోనాల పండుగతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంది.
బోనమెత్తిన పల్లెలు ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES