Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంగాజాలో యుద్ధాన్ని ముగించాలి

గాజాలో యుద్ధాన్ని ముగించాలి

- Advertisement -

రోమ్‌లో భారీ నిరసన ప్రదర్శన ర్యాలీలో పాల్గొన్న 30 వేల మంది
రోమ్‌ :
గాజాలో యుద్ధాన్ని వెంటనే ముగిం చాలని డిమాండ్‌ చేస్తూ సుమారు 30,000మంది ప్రదర్శనకారులు ఇటలీ రాజధాని నగరం రోమ్‌ వీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ఇటలీ ప్రధాన ప్రతిపక్షమైన వామపక్షంతో పాటు పలు పార్టీల పిలుపుమేరకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనకారులు ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. మితవాద ప్రభుత్వం మౌనంగా ఉందని, గాజాలో మారణకాండపై ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించాలని నిరసకారులు డిమాండ్‌ చేశారు. పాలస్తీనా, ప్రతిపక్ష పార్టీల జెండాలను చేతబూని ”ఊచకోతను ఆపండి, కుట్రను ఆపండి” అనే ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. పాలస్తీనియన్ల ఊచ కోతకు, ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు నెతన్యాహూ నేరాలను ఎండగట్టేందుకు ఇది ఒక అపారమైన ప్రజా ప్రతిస్పందనని ఇటలీ సెంటర్‌ లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత ఎల్లీప్లీన్‌ అన్నారు.
ఇటలీ ప్రధాని మెలోనీ తీరుపై ఆమె విమర్శలు చేశారు. మెలోని ప్రభుత్వ విధానం మాదిరిగా కాకుండా మౌనంగా ఉండని మరొక ఇటలీ ఉందని అన్నారు. అసాధారణమైన ఊచకోత, క్రూరమైన, అను చితమైన ప్రతిచర్య జరిగినప్పటికీ ఇటాలియన్‌ ప్రభుత్వం స్పందించడం లేదని ట్యునీషియా ప్రదర్శనకారుడు ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad