Monday, June 30, 2025
E-PAPER
Homeజిల్లాలుతగ్గిన కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం..

తగ్గిన కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం..

- Advertisement -

– జూన్ నెల గడుస్తున్న ఇన్ ఫ్లో రాక ఆందోళనలో రైతులు..
నవతెలంగాణ – జుక్కల్
: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాళా ప్రాజెక్టులోకి జూన్ మాసం గడుస్తున్న నేటికీ ఇన్ ప్లో నీరు రాక పలు గ్రామాల ఆయకట్టు వరి రైతులు ఆందోళనలో ఉన్నారు. గత ఎడాది సెప్టెంబర్ మాసంలో కౌలస్ నాళా ప్రాజెక్టు జలకల సంతరించుకుంది. అప్పుడు కూడా వర్షాలు సమయానికి పడకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు రాలేదు . ప్రస్తుతం ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. జూన్ నెల కాలం గడిచిన కౌలాస్ ప్రాజెక్టులోకి నేటికీ నీరు ఒక ఫీట్ మాత్రమే ప్రాజెక్టు లోకి నీరు ఇన్ ప్లో వచ్చి చేరింది అని ప్రాజెక్టు ఏఈ రవిశంకర్ తెలిపారు.

ప్రాజెక్టు  పూర్తిస్థాయి నీటిమట్టం 458.00 మీటర్లు కాగా , ప్రస్తుతం 454.85 మీటర్లు కొనసాగుతోంది. ప్రాజెక్టు కెపాసిటీ 0.603 టీఎంసీ/ 1.237 టీఎంసీ ఉంది. నేడు ఇన్ ప్లో నిల్ , అవుట్ ఫ్లో నిల్ , ఫ్లడ్ గేట్స్ నిల్ , కెనాల్ నిల్ , మొత్తానికి టోటల్ గా నిల్ కొనసాగుతోంది .  కౌలాస్, మహ్మదాబాద్ , కేమ్రాజ్ కల్లాలి , లాడేగావ్ , ఖండే బల్లూర్, సావర్ గావ్ , లింగంపల్లి , తోపాటు బిచ్కుంద మండలంలోని పలు గ్రామాలకు ఈ ప్రాజెక్టు కెనాల్ ద్వారా పంట పొలాలకు 1200 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయకట్టు కింద సాగు చేస్తున్న వరి రైతులు నేటికీ వరి నాట్లు వేయకపోవడంతో కెనాల్ ద్వారా నీరు సరఫరా కాకపోవడం రైతులు చింతగా ఉన్నారు.

ఒక పంటకు మొదటి ఒక తడికి నీరు సరిపోయే సామర్థ్యం ప్రాజెక్టులో ఉంది. కాబట్టి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఎడాది కూడా వర్షాలు సకాలంలో కురువకపోవ లేదు.  ఈ సంవత్సరం ప్రాజెక్టు నిండాకపోతే ఈసారి కూడా రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం పుంచుకొని ఉందని ఆయకట్టు రైతులు దిగాలుగా ఉంటున్నారు. వరుణుడు కరుణిస్తే తప్ప ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ఏడూర్ గ్రామంలోని అడ్డుకట్ట వేసిన కట్ట పైనుండి నీరు పొంగి వస్తే తప్ప ప్రాజెక్టులోకి ఇతర ప్రాంతాల నుంచి నీరు వచ్చి చేరే అవకాశం లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -