Sunday, September 21, 2025
E-PAPER
Homeజాతీయందేశానికి బలహీనమైన ప్రధాని

దేశానికి బలహీనమైన ప్రధాని

- Advertisement -

హెచ్‌1బీ వీసా అంశంపై మోడీ తీరు సరికాదు : రాహుల్‌

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత, లోక్‌సభ లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోడీపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశం ఒక బలహీనమైన ప్రధానిని కలిగి ఉన్నదని విమర్శించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా అకౌంట్‌ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘ఐ రిపీట్‌, ఇండియా హాజ్‌ ఎ వీక్‌ పీఎం’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. 2017లో కూడా హెచ్‌1బీ వీసా అంశాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ముందు ప్రధాని ప్రస్తావించకపోవడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు. ‘ఇండియా హాజ్‌ ఎ వీక్‌ పీఎం’ అని అప్పట్లో పోస్టు పెట్టారు. తాజాగా హెచ్‌1బీ వీసా ఫీజు పెంపుపై.. ప్రధాని మోడీ మౌనంగా ఉంటున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు.

అంతేగాక ‘ఐ రిపీట్‌, ఇండియా హాజ్‌ ఎ వీక్‌ పీఎం’ అని పోస్టు పెట్టి, 2017లో ‘ఇండియా హాజ్‌ ఎ వీక పీఎం’ అని తాను పెట్టిన పోస్టును గుర్తుచేశారు. రాహుల్‌ గాంధీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేతలు మనీశ్‌ తివారీ, పవన్‌ ఖేరా తదిత రులు కూడా ట్రంప్‌ హెచ్‌1బీ వీసాల జారీకి లక్ష అమెరికన్‌ డాలర్ల ఫీజు విధించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో కోట్ల మంది భారత యువతకు నష్టం వాటిల్ల నుందని చెప్పారు. అమెరికా ఒక క్రమపద్ధతిలో ఇండియాకు ఉచ్చు బిగిస్తోందని విమర్శించారు. పాకిస్థాన్‌తో కాల్పుల విరమణకు ఒప్పించామని చెప్పడం, భారత ఎగుమతులపై సుంకాలను 50శాతానికి పెంచడం, ఇప్పుడు వీసాలపై రుసుములు విధించడం లాంటివన్నీ అమెరికా ప్లాన్డ్‌గా చేస్తోందని, దీనిపై భారత్‌ చడీచప్పుడు లేకుండా ఉంటోందని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -