Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంవికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

వికలాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

– మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

వికలాంగుల సంక్షే మమే ప్రభుత్వ లక్ష్యమని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. వికలాంగ ఉద్యోగుల బదిలీల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ, మానసిక వికలాంగుల కుటుంబాలకు కూడా వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 34 విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని మినిష్టర్‌ క్వార్టర్‌లో డిఫరెంట్లీ అబ్లేడ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని వీరయ్య హాజరయ్యారు. వీరిద్దరిని గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ ద్వారా వికలాంగుల కుటుంబాల్లో ఆనందం చూడటమే ప్రజాపాలన లక్ష్యమని చెప్పారు. వారి స్వయం సమృద్ధి కోసం వేల సంఖ్యలో వికలాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన రోజే వికలాంగుల స్వయం సహాయక సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.15వేల చొప్పున 2,367 సంఘాలకు రూ.3.55కోట్లు అందించినట్టు తెలిపారు. అప్పుడే వ్యక్తిగత సబ్సిడీ రుణాల కోసం రూ.ఐదు కోట్ల ఫైలుపై సంతకం చేసినట్టు గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వికలాంగ ఉద్యోగుల సమస్యలతో పాటు వారి సంక్షేమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు. కార్పొరేషన్‌ చైర్మెన్‌ ముత్తినేని నిరంతరం వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని మంత్రి అభినందించారు.
ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వికలాంగ ఉద్యోగుల బదిలీలపై ఉక్కుపాదం మోపిందని విమర్శించారు. నేటి ప్రజాపాలనలో జీవో 34 ద్వారా వికలాంగుల ఉద్యోగుల బదిలీల్లో రిజర్వేషన్‌ కల్పించటమే గాక, మానసిక వికలాంగులకు కూడా బదిలీల్లో రిజర్వేషన్‌ కల్పించటం హర్షణీయమన్నారు. వికలాంగుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి అడ్లూరికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. కార్యక్రమంలో వికలాంగుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హబీబ్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img