Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeసినిమాప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్‌ రియాలిటీ షో

ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్‌ రియాలిటీ షో

- Advertisement -

నిర్మాత, ఏకే ఎంటర్‌ టైన్మెంట్స్‌ అధినేత అనిల్‌ సుంకర ఒక కొత్త రియాల్టీ షోకు శ్రీకారం చుట్టారు. సినిమా రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రియాల్టీ షో ద్వారా కల్పించనున్నారు.
మొత్తం 16 సినిమా స్క్రిప్ట్స్‌, ఆ స్క్రిప్ట్‌ను పరిశీలించడానికి 12 మంది జడ్జీలు, సినిమాకు స్క్రిప్ట్‌ సెలెక్ట్‌ చేయడం నుంచి ఆర్టిస్టులు, రచయితలు ఇలా 24 విభాగాల్లో పని చేసే టెక్నీషియన్లను మొత్తం 75 రోజుల్లో ఎన్నుకునే విధానాన్ని రియాల్టీ షో రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా మేకింగ్‌ రియాలిటీ షో కావడం విశేషం. ‘షో టైం’ సినిమా తీద్దాం రండి అనే ఉపశీర్షికతో ఒక రియాల్టీ షోను తీసుకురాబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ,’చాలామంది సినిమా తీయాలన్నా ప్యాషన్‌తో తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టి సినిమా నిర్మిస్తారు. కానీ దాన్ని విడుదల చేయడానికి చాలా కష్టాలు పడతారు. చాలామంది డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా నేను చూశాను. అలాగే ఈ రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం కూడా విపరీతంగా పెరిగింది. ప్రొడక్షన్‌లో చాలావరకు అనవసరమైన ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సవాళ్లు ఎన్నో సినిమా తీసే నిర్మాతకు ఎదురవుతున్నాయి. వాటన్నింటినీ ఈ రియాల్టీ షో ద్వారా చూపించబోతున్నాం. అన్ని రియాల్టీ షోలా మాదిరిగానే ఇది కూడా ఎలాంటి స్క్రిప్ట్‌ లేని రియాల్టీ షో. ఇది ఒక ప్రముఖ ఓటీటీలో ఇంటర్నేషనల్‌ వైడ్‌గా స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ షోకు మొత్తం 16 స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకొని అందులో 4 బెస్ట్‌ స్క్రిప్ట్స్‌ను 12 మంది జడ్జీలు ఫైనల్‌ చేస్తారు. ఆ ఫైనల్‌ అయిన వాటికి అన్ని విభాగాల్లో పనిచేసే నిపుణులను, ఆర్టిస్టులను షోలోనే ఎన్నుకుంటారు. ఇక ఆ స్క్రిప్ట్స్‌ నేరుగా ఆసక్తి ఉన్న నిర్మాతలు బెడ్డింగ్‌ చేసి ఒక కోటి రూపాయలలో కేవలం 30 రోజులలోనే సినిమా పాటలతో సహా షూటింగ్‌ జరిపేలా ఒక అద్భుతమైన ప్రణాళికను రెడీ చేశాం’ అని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad