Thursday, February 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రంగాపురం కాలువ కట్ట తెగే ప్రమాదం ఉంది 

రంగాపురం కాలువ కట్ట తెగే ప్రమాదం ఉంది 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని దుంపలగూడెం గ్రామం రంగాపురం కాలువ బొబ్బ వెంకట్రెడ్డి పొలం వద్ద కట్ట పైనుండి కాలువ నీరు పొంగి ప్రవహిస్తోంది. కాలువ పూడిక చెత్త నిలువ ఉండడం వల్ల నీరు ముందుకు ప్రవహించక కమ్మటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్తులు రైతులు తెలుపుతున్నారు. నీటి వరదల శాఖ అధికారులు వెంటనే స్పందించి జెసిబి సహాయంతో కాని రైతులను సమీకరించి కానీ చెత్త పూడిక తొలగించినట్లయితే కట్ట తెగే ప్రమాదం తప్పుతుందని అంటున్నారు.

లేనియెడల భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రైతులు హెచ్చరిస్తున్నారు. కట్ట తెగితే నాటు వేసిన పొలాలు కోతకు గురి అయ్యే ప్రమాదం ఉంది. మళ్లీ కట్ట పోచడానికి కాలువను బంద్ చేయాలి కట్ట పోయాలి కొంత సమయం పడుతున్నందున మీరంతా ఎండాకాలం రైతులు ఇబ్బందులు పడే పరిస్థితిని ఏర్పడతాయి. కావున అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలను చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -