నవతెలంగాణ – అశ్వారావుపేట
గెలుపు ఓటములు సహజం కానీ గెలుపు లోనూ ఘనత సాధించాలని అనుకోవడం, అందుకు అనుగుణంగా ఫలితాలు రాబట్టడం మరో ఘనత. అయితే ఆధిక్యత ను బట్టి రాజకీయంలో ఆ వ్యక్తి ప్రాధాన్యత, పరపతి పెరుగుతుంది. అశ్వారావుపేట మున్సిపాలిటీ లో ప్రధమ పాలకవర్గం సభ్యులు గా ఎవరికి ఎంత ఆధిక్యత వచ్చిందో చూద్దాం.
వార్డు వారీగా ఘన విజయం పొందిన కౌన్సిలర్ లలో అత్యధిక మెజారిటీతో 9 వ వార్డు అభ్యర్థి కారం కనక దుర్గ ముందంజ లో ఉండగా 8 వ వార్డు అభ్యర్థి రెహానా షేక్ 10 ఓట్లు తో చిట్ట చివరన ఉన్నారు. శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలు అభ్యర్థులు విశేష మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 22 వార్డుల్లో ప్రధానంగా కాంగ్రెస్ అధిక స్థానాలను గెలుచుకుని ఆధిక్యత ప్రదర్శించింది. అత్యధిక మెజారిటీ 373 ఓట్లతో 9 వ వార్డులో కరం కనక దుర్గ (కాంగ్రెస్) విజయం సాధించారు.
ఈ వార్డులో ఇరువురు పోటీపడ్డారు.మొత్తం 851 గానూ 558 ఓట్లు పోల్ అయ్యాయి.చెల్లని ఓట్లు పోను 543 ఓట్లలో కారం కనక దుర్గ కు 458,టీఆర్ఎస్ అభ్యర్ధి ఊకే సుమలత కు 85 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆమె తరువాత 2 వ వార్డులో మౌనిక దగ్గుమల్లి (కాంగ్రెస్) 341 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ వార్డులో నలుగురు పోటీ పడ్డారు.701 ఓట్లు కు గాను 625 ఓట్లు పోల్ అయ్యాయి. దగ్గుమల్లి మౌనిక కు 465,టీఆర్ఎస్ అభ్యర్ధిని నీలం రత్న వేణి కి 122,బీజేపీ అభ్యర్ధిని కి బాణాల సునీత కు 3,ఏడీ ఆర్పీ అభ్యర్ధిని మద్దాల రాణి కి 5 ఓట్లు వచ్చాయి.
3 వ వార్డులో చిన్నంశెట్టి శ్రీను (కాంగ్రెస్), 13 వ వార్డులో జూపల్లి రమేష్ బాబు (కాంగ్రెస్) ఇద్దరూ 313 ఓట్ల మెజారిటీతో విజయం నమోదు చేశారు. 1 వ వార్డులో డేరంగుల ప్రసాద్ (కాంగ్రెస్) 267 ఓట్లతో, 10 వ వార్డులో హరిబాబు మిండ (కాంగ్రెస్) 267 ఓట్లతో గెలుపొందారు. 11 వ వార్డులో నార్లపాటి మహేష్ బాబు (కాంగ్రెస్) 206 ఓట్లు, 4 వ వార్డులో కట్టా సింధుజ (కాంగ్రెస్) 192 ఓట్లు, 16 వ వార్డులో ఆధి లక్ష్మి దండాబత్తుల (కాంగ్రెస్) 175 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.
ఇక ఇతర పార్టీల విషయానికి వస్తే, 7 వ వార్డులో కొల్లి రవి కిరణ్ (బీఆర్ఎస్) 18 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 14 వ వార్డులో భూక్య ఉదయ జ్యోతి (బీఆర్ఎస్) 88 ఓట్లతో విజయం సాధించారు. 17 వ వార్డులో గుంట గీతా శ్రీ (బీజేపీ) 45 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 19 వ వార్డులో జీనుగు రవీంద్ర కుమార్ (స్వతంత్ర) 15 ఓట్లతో, 21 వ వార్డులో నార్లపాటి మౌనిక (స్వతంత్ర) 42 ఓట్లతో విజయం సాధించారు.
మొత్తం ఫలితాల ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, కొన్ని వార్డుల్లో ఇతర పార్టీలు కూడా తమ ప్రభావాన్ని చూపించాయి. స్థానిక ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనపై ఆశలు పెట్టుకుని కొత్త ప్రతినిధులను ఎన్నుకున్నారు.



