Sunday, May 25, 2025
Homeప్రధాన వార్తలుతెలుగు చిత్రసీమకు కనీస కృతజ్ఞత లేదు..

తెలుగు చిత్రసీమకు కనీస కృతజ్ఞత లేదు..

- Advertisement -

– ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌
– ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా ఎందుకు కలవలేదు?
– గత ప్రభుత్వం పరిశ్రమని ఎలా ఛీత్కరించిందో మరచారా?
– ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవు..
– సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి
– కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు..
– సినిమా రంగం అభివద్ధినే చూస్తుంది.

తెలుగు చిత్ర పరిశ్రమ తీరుపై ఏపీ ఉపముఖ్యమంత్రి, హీరో పవన్‌కళ్యాణ్‌ మండి పడ్డారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కతజ్ఞత కనిపించడం లేదని కోపం వ్యక్తం చేశారు. ఎన్‌.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు.
పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘హరి హరి వీరమల్లు’ చిత్రం జూన్‌ 12వ తేదీన విడుదల కానుంది. అయితే జూన్‌ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్‌ అనే వార్తతోపాటు తెలుగు సినీ పరిశ్రమ అనుసరిస్తున్న తీరుపై ఆయన ఘాటుగా స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
తెలుగు సినిమా రంగంలోని అగ్ర నటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా ఛీత్కరించుకుని, ఇక్కట్ల పాల్జేసిందో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి, మూవీ ఆరిస్ట్స్‌ అసోసియేషన్‌ లాంటి సంఘాలు మరచిపోయినట్లున్నాయి.
టిక్కెట్‌ ధర పెంచమనే విషయంలో అందరూ కలసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని సూచించినా, ఆ సూచనని పట్టించుకోకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్‌ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకి అర్జీలు ఇస్తూ వచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది.
తెలుగు సినిమాకి చెందిన కొందరు ఇచ్చిన రిటర్న్‌ గిఫ్ట్‌ను కూడా తగిన విధంగానే స్వీకరిస్తాం. ఈ రిటర్న్‌ గిఫ్ట్‌కు కతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావులేదు. సంబంధిత విభాగం ప్రతినిధుల తోనే చర్చిస్తాం. వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తాం.
ఏపీలో సినిమా రంగం అభివద్ధి కోసం కాంప్రహెన్సివ్‌ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ పాలసీని ప్రకటిస్తార. ఈ పాలసీ ద్వారా ఏపీలో సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకూ 24 విభాగాల్లో నైపుణ్యాలు పెంపుదల… అధునాతన సాంకేతికత వినియోగంపై ప్రత్యేక దష్టిపెట్టబోతున్నాం. దీనికి అవసరమైన శిబిరాలు, సెమినార్లు, సింపోజియమ్స్‌ లాంటివి విరివిగా నిర్వహిస్తాం. సినిమా రంగంలో స్టూడియో నుంచి సినిమా హాల్‌ వరకూ ఉండే విభాగాలలో గుత్తాధిపత్యం కంటే ఎక్కువ మందికి అవకాశాలు కల్పిస్తేనే- పెట్టుబడులు పెరిగి పరిశ్రమగా వద్ధి చెందుతుందని విశ్వస్తిస్తున్నాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -