– పేరులో అక్షరదోషంపై ఆర్థికవేత్త అమర్త్యసేన్‌కు ఈసీఐ వివరణ
– వేధింపులే : కుటుంబీకులు
ఓటరు జాబితాలో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ పేరులో తపొప్పుల్లో ఉన్న వ్యత్యాసాలపై సమన్లు జారీ చేసిన భారత ఎన్ని కల సంఘం (ఈసీఐ) ఆయన విచారణకు హాజ రు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఓటర్ల పేర్లలోని స్పెల్లింగ్ మిస్టేక్‌లతో సహా చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దే అధికారం బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) ఉన్నందున, ఆర్థికవేత్త విషయంలో ఈ సవరణను స్థానిక స్థాయిలో పరిపాలనాపరంగా పరిష్కరిస్తారని తెలిపింది. ఈసీ ద్వారా అమర్త్యసేన్‌కు ‘సర్’ విచారణ నోటీసు జారీ చేసిందని మంగళవారం టీఎంసీ నాయకుడు అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుడు ఒకరు పీటీఐతో మాట్లాడుతూ, తమకు కమిషన్ నుంచి ఇంకా ఎలాంటి విచారణ నోటీసు అందలేదని తెలి పారు. ఒకరకంగా ఇవి వేధింపులేనని వారు పేర్కొన్నారు.
విచారణకు రావాల్సిన అవసరం లేదు
- Advertisement -
- Advertisement -



