Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం తగదు: ఎంపీడీఓ 

అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం తగదు: ఎంపీడీఓ 

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ ఉపాధి హామీ పనులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధిహామీ కూలీలందరికీ ఈ కేవైసీ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త పనుల గుర్తింపు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి బేస్మెంట్, పైకప్పు లెవెల్ పేమెంట్లు వెంటనే పూర్తి చేయాలని, నర్సరీల నిర్వహణ, వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆదేశించారు. మెటీరియల్ పనులకు సంబంధించి పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వేగవంతం చేయాలని వివరించారు. ఉపాధి హామీ పనులు ప్రతి గ్రామంలో ప్రారంభించాలని, కూలీలకు కనీస వేతనం వచ్చే విధంగా చూడాలని తెలిపారు. 

ఈ సమీక్ష లో ఉపాధి హామీ ఏపీవో జీ,నర్సయ్య, ఉపాధి హామీ సిబ్బంది,ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మెట్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -