దీంతో రోగుల ఖర్చులు పెరుగుతున్నాయి
ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అవసరం
పార్లమెంటరీ ప్యానెల్ వెల్లడి
న్యూఢిల్లీ : భారత్‌లో డయాగ్నస్టిక్ టెస్టులు, స్కానింగ్ సేవలపై ధరల నియంత్రణ లేకపోవడంతో రోగులు భారీగా స్వంతంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పేర్కొంది. భారత్‌లో ఔషధాలు, కార్డియాక్ స్టెంట్ల వంటి కొన్ని వైద్య అంశాలపై నియంత్రణ ఉన్నప్పటికీ.. ఆరోగ్య ఖర్చుల్లో పెద్ద భాగమైన డయాగ్నస్టిక్ టెస్టులు, మెడికలు పరికరాలు మాత్రం ఇంకా నియంత్రణలో లేవు. దీంతో రోగులపై నేరుగా ఖర్చు పెరుగుతోంది.
ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ అవసరం
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెడికల్ డివైజ్‌ల కోసం ప్రత్యేక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఉన్న నియమాలు ఔషధా విధానాన్ని అనుసరిస్తున్నాయి. కానీ మెడికల్ పరికరాల రంగానికి అవి సరిపోవడం లేదు. ఈ సందర్భంలో ఆహార భద్రత నియంత్రణ సంస్థ అయిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది.
డయాగస్టిక్ టెస్టులపై ఏకరీతి ధరల విధానం లేదు
డయాగ్నస్టిక్ టెస్టులు, స్కానింగ్, ఇమేజింగ్ సేవలపై దేశవ్యాప్తంగా ఏకరీతి ధరల విధానం లేదు. కొన్ని రాష్ట్రాలు మాత్రమే కొన్ని సార్లు ధరలను నియంత్రించాయి. ఉదాహరణకు కరోనా సమయంలో ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు వంటివి. కానీ దేశవ్యాప్తంగా ఒక స్థిరమైన విధానం మాత్రం లేదు. దీంతో ఒకే టెస్ట్‌కు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో రోగులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇన్సూరెన్స్ లోపాలు.. రోగులకు అదనపు భారం
కేంద్ర ప్రభుత్వ పథకం ఆయుష్మాన్ భారత్ కింద కూడా పూర్తిస్థాయి కవరేజ్ లేదు. కార్డియాక్ క్యాథెటరైజేషన్ వంటి చికిత్సలకు పూర్తిగా ఖర్చు కవర్ చేయడం లేదు. వాల్వ్‌లు, ఎవొర్టిక్ స్టెంట్లు వంటి పరికరాల ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి. అధునాతన పరికరాల ఖర్చు ఎక్కువగా రోగులే భరిస్తున్నారు. కాబట్టి ఈ పథకంలోని ప్యాకేజ్ రేట్లను తరచుగా సమీక్షించి పెంచాలని కమిటీ సూచించింది.
పరిశ్రమలో మార్పుల అవసరం
కమిటీ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. చిన్న తప్పిదాలకు క్రిమినల్ కేసులు కాకుండా తక్కువస్థాయి జరిమానాలు విధించాలనీ, దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు దిగుమతి సుంకాలు పెంచాలనీ, లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనీ, విదేశీ నియంత్రణ సంస్థలు ఆమోదించిన పరికరాలకు త్వరగా అనుమతులు ఇవ్వడం చేయాలని సూచించింది.
డయాగ్నస్టిక్ పరీక్షలపై నియంత్రణ లేదు
- Advertisement -
- Advertisement -



