Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు

- Advertisement -

– ఎస్ఆర్ఆర్ శ్రీనివాస్ రెడ్డి పనికి హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
నవతెలంగాణ – రాయపర్తి
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు అన్నట్లుగా ఉంది ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సేవా భావం. ఇటీవల తండా బాట కార్యక్రమంలో భాగంగా సూర్య తండాలో పర్యటిస్తుండగా సీసీ రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోవడంతో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శ్రీనివాస్ రెడ్డికి విన్నవించగా వారు సమస్యను అతి త్వరలో తీరుస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం నీరు రోడ్డుపై నిలిచిపోకుండా ఉండడానికి జెసిబి సహాయంతో పైప్ లైన్ వేశారు.

దాంతో రోడ్డుపై నిలిచిపోయిన మురుగునీటి సమస్య పరిష్కారమైంది. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో తండా వాసులతో పాటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యవారని, ఆశుభ్రమైన పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తేవని గిరిజనులు వారి గోడును తెలిపారు. తమ బాగు కోసం పైపులైన్ చేసిన శ్రీనివాస్ రెడ్డికి గిరిజన ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ యూనియన్ ఉపాధ్యక్షులు సూర్య సురేందర్ రాథోడ్ నాయక్, మాజీ ఎంపీటీసీ మునావత్ వెంకన్న, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధి సంకినేని ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img